YS Avinash Reddy: షార్ట్‌ నోటీస్‌.. ఈ రోజు విచారణకు రాలేను: సీబీఐకి ఎంపీ అవినాష్‌ లేఖ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నేడు సీబీఐ విచారణకు హాజరుకాలేదు. ఈరోజు విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ, ఆయన హాజరుకాకుండా సీబీఐ అధికారులకు లేఖ రాశారు.

Updated : 16 May 2023 12:44 IST

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నేడు సీబీఐ విచారణకు హాజరుకాలేదు. ఈరోజు విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ, ఆయన హాజరుకాకుండా సీబీఐ అధికారులకు లేఖ రాశారు. షార్ట్‌ నోటీసు ఇచ్చినందున.. విచారణకు మరింత సమయం ఇవ్వాలని అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున రాలేనని చెప్పారు. మరో నాలుగు రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని.. అందుకే విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని సీబీఐకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. అనంతరం అవినాష్‌ పులివెందుల బయల్దేరి వెళ్లారు. 

మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని సోమవారం జారీ చేసిన నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద ఈ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలుమార్లు అవినాష్‌రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ.. గత 20 రోజులుగా విచారణ చేపట్టలేదు. తాజాగా కడప ఎంపీకి నోటీసులిచ్చి విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

వివేకా కేసులో అవినాష్‌రెడ్డి పాత్ర, ప్రమేయంపై ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కౌంటర్‌లో సీబీఐ స్పష్టంగా పేర్కొంది. ఈ కేసులో భారీ కుట్రకు అవినాష్‌, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డి పాల్పడ్డారని పేర్కొన్న విషయం తెలిసిందే.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని