YS bhaskar reddy: భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వై.ఎస్.భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ వాయిదా పడింది.

హైదరాబాద్: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వై.ఎస్.భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణను న్యాయస్థానం ఈనెల 5కు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ అధికారులను కోర్టు ఆదేశించింది. భాస్కరరెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు.
‘‘సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో నా పాత్రకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు లేవు. సాక్ష్యాల చెరిపివేతలో నాకు ఎలాంటి సంబంధంలేదు. ఎలాంటి ఆధారాలూ లేకపోయినా నన్ను అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారు. అంతేకాకుండా నా ఆరోగ్యం సరిగా లేదు’’ అని భాస్కరరెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో కుట్రతోపాటు సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాల చెరిపివేతలో కీలక పాత్ర పోషించారంటూ భాస్కరరెడ్డిని సీబీఐ ఏప్రిల్ 16న అరెస్టు చేసింది.
మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్ రెడ్డి సీబీఐ కోర్టులో విచారణకు హాజరయ్యారు. కేసు విచారణను సీబీఐ కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!