YS Bhaskar reddy: వైఎస్ భాస్కర్ రెడ్డికి నిమ్స్‌లో పరీక్షలు
వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టైన కడప ఎంపీ అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి నిమ్స్ ఆస్పత్రిలో పరీక్షలు చేశారు.

హైదరాబాద్: వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టైన కడప ఎంపీ అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి నిమ్స్ ఆస్పత్రిలో పరీక్షలు చేశారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఆయన, శుక్రవారం అస్వస్థతకు గురవడంతో అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సిఫార్సు చేశారు.
ఈ నేపథ్యంలో భాస్కర్ రెడ్డిని ఇవాళ నిమ్స్‌కు తరలించారు. అక్కడ ఆయనకు గుండెకు సంబంధించిన పరీక్షలు వైద్యులు చేశారు. అత్యవసర విభాగంలో ప్రత్యేక వైద్యుల సమక్షంలో ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలను నిర్వహించారు. పరీక్షలు అనంతరం భాస్కర్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Anirudh: ఆ సమయంలో నేనెంతో బాధపడ్డా: అనిరుధ్
-
Chatrapati Shivaji: 350 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరనున్న ఛత్రపతి శివాజీ ఆయుధం
-
Kuppam: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కుప్పంలో భారీ ర్యాలీ
-
LPG prices: వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై భారం.. రూ.209 పెంపు
-
ODI WC 2023: ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ అతడే.. మరెవరూ పోటీలేరు: యువరాజ్ సింగ్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు