తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా: షర్మిల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల లోటస్ పాండ్‌లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు...
హైదరాబాద్: తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని వైఎస్ షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల లోటస్ పాండ్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ముఖ్య నేతలతో సమావేశం ముగిసిన తర్వాత షర్మిల మాట్లాడుతూ... ’‘ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు. రాజన్న రాజ్యం ఎందుకు రాకూడదు. తెలంగాణలో వైఎస్సార్ లేని లోటు ఉంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం. ఇవాళ నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడా. మిగిలిన జిల్లాల నేతలతోనూ మాట్లాడతా. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకే సమావేశాలు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తా’’ అని షర్మిల తెలిపారు.ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షర్మిలపై కాగితపు పూల వర్షం కురిపించారు. బాణ సంచా కాలుస్తూ.. నృత్యాలతో సందడి చేశారు.
వైఎస్సార్ అభిమానులారా తరలి రండి.. అని గతంలో వైఎస్‌తో అనుబంధం ఉన్న నేతలకు, ఆయనతో పని చేసిన వారికి షర్మిల తరఫున ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు. షర్మిల ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్లెక్సీలపై ఎక్కడా సీఎం జగన్ ఫొటోలు లేకుండా.. షర్మిల ఫొటోలను మాత్రమే ఏర్పాటు చేశారు. వైఎస్ అభిమానులు షర్మిల ఇంటికి భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో పార్టీ ఏర్పాటుపై షర్మిల క్లారిటీ ఇచ్చారు.
ఇవీ చదవండి..
ఏపీలో పంచాయతీ పోరు ఉద్రిక్తం
అందరి చూపు.. మేయర్ ఎన్నిక వైపు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆకాంక్షించారు. -
ఏపీలో పింఛన్ల పంపిణీ.. వాలంటీర్లకు కీలక ఆదేశాలు
ఏప్రిల్, మే నెల పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) సర్క్యులర్ జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం నిబంధనలు అమలు కావు: జస్టిస్ చలమేశ్వర్
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. -
ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
నేడు నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ముంబయి-హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్‌చరణ్ దంపతులు
తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్‌చరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మావయ్యా.. ఇదేం ప్రగతయ్యా..?
నాడు-నేడు అంటూ విద్యా వ్యవస్థలో, మౌలిక సదుపాయాల కల్పనలో ఎన్నో సమూల మార్పులు తెచ్చామని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. నేటికీ పలు చోట్ల ఆ ప్రగతి కనిపించడం లేదు. -
డబ్బులు ఇస్తారా.. స్టేషన్‌కు వస్తారా..!
కొంతమంది పోలీసులు అధికారుల ఆదేశాలను అడ్డుగా పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము నిబంధనలు ఉల్లంఘించలేదని తమను వదిలిపెట్టాలని బాధితులు వేడుకుంటున్నా వారు వినిపించుకోకుండా తమదైన ముద్ర చూపుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.. -
ప్రయాణికుల రద్దీ.. 32 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఆ రైళ్ల వివరాలివే..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
-
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
-
దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది ‘రాజకీయ ప్రతీకారమే’ - ఆప్
-
మథుర కాకపోతే పోటీ చేసేదాన్ని కాదు : హేమమాలిని
-
ఆరు నెలల్లో.. రూ.7.5 లక్షల కోట్ల రుణానికి కేంద్రం సిద్ధం