Viveka Murder case: వివేకా హత్య కేసు విచారణ బదిలీ.. ఒకట్రెండు రోజుల్లో తీర్పు ఇస్తాం: సుప్రీం

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఆర్.షా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

Published : 28 Nov 2022 17:46 IST

దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఆర్.షా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కుమార్తె వైఎస్‌ సునీత పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఒకట్రెండు రోజుల్లో తీర్పు ఇవ్వనున్నట్లు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వేరే రాష్ట్రానికి కేసు బదిలీపై తీర్పు తర్వాతే సీబీఐ పిటిషన్‌పై విచారణ చేస్తామని స్పష్టం చేసిన ధర్మాసనం.. కేసు విచారణను డిసెంబరు 2కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని