Viveka murder case: వివేకా హత్య కేసు.. పులివెందుల కోర్టులో తులసమ్మ వాంగ్మూలం నమోదు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హాత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల కోర్టులో వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.

Updated : 26 Nov 2022 14:23 IST

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హాత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్‌ ముందు తులసమ్మ వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్య కేసులో మరో ఆరుగురిని విచారించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో తులసమ్మ పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ విచారణ జరపాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, వివేకా బావమరిది శివప్రకాశ్‌రెడ్డి, కొమ్మ పరమేశ్వర్‌రెడ్డి, బీటెక్‌ రవి, రాజేశ్వర్‌ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌ను విచారించాలని కోరారు. పిటిషన్‌ దాఖలు చేసిన 9 నెలల తర్వాత పులివెందుల కోర్టు ఇవాళ తులసమ్మ వాంగ్మూలం నమోదు చేసుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని