Tadepalle: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైకాపా కార్యాలయం కూల్చివేత

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైకాపా కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు.

Updated : 22 Jun 2024 15:19 IST

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైకాపా కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. నీటి పారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారు. బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైకాపా కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్‌ కట్టబెట్టింది. ఈ అక్రమ నిర్మాణంపై వైకాపాకు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

తాడేపల్లి వైకాపా కార్యాలయం.. అసలు వాస్తవాలు

ఇరిగేషన్ భూమిని ఆక్రమించి, అనధికారికంగా వైకాపా కడుతున్న పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని ఎంటీఎంసీ అధికారులు కూల్చివేశారు. అధికారం అండతో తాడేపల్లిలో 202/A1 సర్వే నంబర్లోని 2 ఎకరాల ఇరిగేషన్ భూమిని పార్టీ కార్యాలయానికి జగన్‌ కేటాయించుకున్నారు. 2 ఎకరాల్లో భవనాలు కట్టి.. మిగిలిన 15 ఎకరాలు కొట్టేయడానికి వైకాపా నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు. స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకారం లేదు. సీఆర్డీఏ, ఎంటీఎంఈ, రెవెన్యూ శాఖలు ఈ భూమిని వైకాపాకు హ్యాండోవర్ చేయలేదు. 

వైకాపా కార్యాలయ నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. నీటిపారుదల శాఖ భూమిని కబ్జా చేసి.. ఏ ఒక్క అనుమతి లేకుండా కార్యాలయ నిర్మాణం చేపట్టారు. వైకాపా కబ్జాలపై తెదేపా గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ, ఎంటీఎంసీ కమిషనర్లను కోరారు. దీంతో ఎంటీఎంసీ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని