సీఎంతో మాట్లాడా.. సాయం చేస్తాం: అమిత్‌ షా

భారీ వర్షాలతో వణుకుతున్న హిమాచల్‌ప్రదేశ్‌కు కేంద్రం నుంచి సాధ్యమైన మేరకు సాయం చేస్తామని  కేంద్ర హోంమంత్రి .....

Published : 12 Jul 2021 19:43 IST

దిల్లీ: భారీ వర్షాలతో వణుకుతున్న హిమాచల్‌ప్రదేశ్‌కు కేంద్రం నుంచి సాధ్యమైన మేరకు సాయం చేస్తామని  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సీఎం జైరాం ఠాకూర్‌తో మాట్లాడారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలతో వరదనీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్టు అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం చేరుకుంటున్నాయని సీఎంకు తెలిపానన్నారు. హోంమంత్రిత్వశాఖ అక్కడి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందన్నారు. 

మరోవైపు, హిమాచల్‌ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో సాధారణ జనజీవనం స్తంభించింది. పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదనీరు పొంగి ప్రవహిస్తోంది. ధర్మశాలలో కార్లు వరద నీటిలో కొట్టుకుపోగా.. హోటళ్లు, ఇతర భవనాలు నీటిలో మునిగిపోయిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని