Corona New Variant: కరోనా కొత్త వేరియంట్ సీ.1.2 దేశంలో ప్రవేశించలేదు: కేంద్రం 

యావత్ ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్న కరోనా మరో కొత్త రూపాంతరం సీ.1.2ను భారత్‌లో గుర్తించలేదని కేంద్రం స్పష్టంచేసింది.

Published : 02 Sep 2021 11:11 IST

దిల్లీ: కరోనా కొత్త వేరియంట్‌ సీ.1.2ను భారత్‌లో గుర్తించలేదని కేంద్రం స్పష్టంచేసింది. ఇప్పటి వరకు సీ.1.2కు సంబంధించి దేశంలో ఎలాంటి కేసులూ నమోదు కాలేదని కేంద్రం చెప్పినట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ వేరియంట్‌ను మే నెలలో తొలిసారి దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ప్రస్తుతం ఇది  చైనా, ఇంగ్లండ్, న్యూజిలాండ్  సహా ఆరు దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇప్పటి వరకు కనుగొన్న వేరియంట్లతో పోలిస్తే సీ.1.2 ఎంతో ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఈ వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. టీకాల ద్వారా లభించిన రక్షణనను సైతం ఈ వేరియంట్  తప్పించుకోగలదని నిపుణులు హెచ్చరించారు. అయితే , ప్రస్తుతానికి ఈ రకం వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించలేదని కేంద్రం వెల్లడించడం ఊరటనిస్తోంది.

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని