Punjab CM Dance: సీఎం సాబ్‌ డ్యాన్స్‌ చూశారా!

ఈ చిత్రంలో అదరగొట్టే డ్యాన్స్‌ స్టెప్స్‌తో కనిపించేది.. ఏ సినిమా హీరో కాదు, డ్యాన్స్‌ షో జడ్జి కాదు.. కొరియోగ్రాఫర్‌ అంతకన్నా కాదు. ఇంత ఎనర్జిటిక్గా నృత్యం చేసేది పంజాబ్‌ సీఎం, దళిత నేత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీనే.

Published : 24 Sep 2021 01:26 IST

పోనిలే.. కొద్దిరోజులు ఎంజాయ్‌ చేయనివ్వండంటూ నెటిజన్లు సెటైర్లు

చండీగఢ్‌: ఈ చిత్రంలో అదరగొట్టే డ్యాన్స్‌ స్టెప్స్‌తో కనిపించేది.. ఏ సినిమా హీరో కాదు, డ్యాన్స్‌ షో జడ్జి కాదు.. కొరియోగ్రాఫర్‌ అంతకన్నా కాదు. ఆయన ఎవరో కాదు పంజాబ్‌ సీఎం, చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీనే. ఈనెల 19న పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన ఆయన.. కపుర్తాలాలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఇలా స్టేజీ మీద ‘భాంగ్రా డ్యాన్స్‌’ వేశారు. 58ఏళ్ల ఈ రాజకీయ నేత తనదైన ఎనర్జీతో జానపద నృత్యకారులతో కాలు కదిపి వారిలో ఉత్సాహం నింపారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సామాజిక  మాధ్యమాల్లో వైరల్‌ అవ్వగా.. ‘‘పోనిలే! కొత్తగా వచ్చాడు.. కొన్ని నెలలు ఎంజాయ్‌ చేయనివ్వండి’’ అంటూ ఛలోక్తులు విసిరారు నెటిజన్లు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని