Corona: అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం: ఉద్ధవ్‌

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మరోవైపు కరోనా మూడో దశ వ్యాప్తి ప్రమాదం కూడా పొంచి ఉందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి చిన్నారులపై వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రెండోదశ వ్యాప్తిలో తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. మూడోదశ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ..

Published : 23 May 2021 19:38 IST

ముంబయి: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మరోవైపు కరోనా మూడో దశ వ్యాప్తి ప్రమాదం కూడా పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి చిన్నారులపై వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రెండోదశ వ్యాప్తిలో తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. మూడోదశ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు. రెండోదశలో పడకలు, ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడిదని, ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నామని ఉద్ధవ్‌ తెలిపారు.

మరోవైపు దేశంలోనూ వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడిందని, రాష్ట్రానికి వ్యాక్సినేషన్‌ సరఫరాను బట్టి జూన్‌ నెలలో టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని ఉద్ధవ్‌ వెల్లడించారు. ముంబయిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ లభ్యత కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామన్నారు. ‘‘ కరోనా వైరస్‌పై పూర్తిస్థాయిలో పోరాడలేకపోయినప్పటికీ, కేసుల సంఖ్యను అనూహ్యంగా తగ్గించగలిగాం. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా నియంత్రణలోనే ఉంది. కానీ, మూడో దశలో పిల్లలపై వైరస్‌ ప్రభావం పడకుండా జాగ్రత్తపడాలి. తొలి దశలో వయోధికులపై, రెండో దశలో యువతపైనా మహమ్మారి తన ప్రభావం చూపింది.’’అని ఉద్ధవ్‌ అన్నారు. వైరస్‌ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదన్నారు. కొవిడ్‌ లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టరును సంప్రదించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని