NOTA: నోటాకు జై.. ఐదేళ్లలో 1.29కోట్ల మంది నోటాకు ఓటు
గత ఐదేళ్లలో దేశంలో జరిగిన సార్వత్రిక, ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 1.29కోట్ల మంది ఓటర్లు ‘నోటా’కు ఓటువేసినట్లు వెల్లడైంది.
ఏడీఆర్, న్యూ విశ్లేషణలో వెల్లడి
దిల్లీ: దేశంలోని ఓటర్లకు ఎన్నికల్లో (Elections) నిలబడే అభ్యర్థులు నచ్చని పక్షంలో ఎవ్వరికీ ఓటు వేయకుండా నోటా (NOTA) ఆప్షన్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, గత ఐదేళ్లలో దేశంలో జరిగిన సార్వత్రిక, ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 1.29కోట్ల మంది ఓటర్లు ‘నోటా’కు ఓటువేసినట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించిన వివరాలను అసోసియేట్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది.
2018 నుంచి 2022 వరకు నోటాకు పడిన ఓట్ల సరళిని ఎడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) విశ్లేషించింది. ఈ మధ్యకాలంలో మొత్తంగా అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో 64 లక్షల ఓట్లు నోటాకు పడినట్లు తేలింది. ఇక లోక్‌సభ ఎన్నికల విషయానికొస్తే.. బిహార్‌లోని గోపాల్‌గంజ్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా 51,660 ఓట్లు నోటాకు పోలయ్యాయి. అతి తక్కువ మాతం లక్షద్వీప్‌లో 100 ఓట్లు నోటాకు పడ్డాయి.
ఇక 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 7లక్షల 42వేలు నోటాకు పడ్డాయి. అతి తక్కువగా 2018లో జరిగిన మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు కేవలం 2917 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు ఎవ్వరూ లేకపోవడంతో అక్కడ నోటాకు కూడా ఒక్క ఓటు పడలేదు.
2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1.46 శాతం (7,49,360 ఓట్లు) నోటాకు పోల్ అవ్వగా.. వాటిలో అత్యధికంగా బిహార్‌లో(7,06,252 ఓట్లు) దిల్లీలో 43,108 ఓట్లు పోలయ్యాయి. అనంతరం 2022లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 0.70శాతం మాత్రమే నోటాకు పడ్డాయి. గోవా, మణిపుర్‌లలో 10వేల చొప్పున, పంజాబ్‌లో లక్షా 10వేలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో 6లక్షల 37వేలు, ఉత్తరాఖండ్‌లో 46వేల ఓట్లు నోటాకు పోలయ్యాయి.
ఇదిలాఉంటే, ఏదైనా నియోజకవర్గం ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే నోటా (NOTA)కు ఎక్కువ ఓట్లు వస్తే.. గెలుపు ఎవ్వరిదీ కాదని ప్రకటించాలని ఏడీఆర్ సిఫార్సు చేస్తోంది. మళ్లీ ఎన్నికలు నిర్వహించి.. అంతకుముందు పోటీలో ఉన్న అభ్యర్థులు మళ్లీ పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్‌స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్‌లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్‌పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్‌పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్‌ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్‌కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్‌కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్‌ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్‌డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!