pakistan: పాక్‌లో పోషకాహార లోపంతో 1.77లక్షల మంది చిన్నారుల మరణం

పాకిస్తాన్‌లో పోషకాహార లోపం కారణంగా  నిండా ఐదేళ్లు నిండకుండానే 1.77లక్షల మందికి పైగా పిల్లలు మరణించినట్లు  పాక్‌ జాతీయ ఆహార భద్రతాశాఖ మంత్రి సయిద్‌ ఫక్కార్‌ ఇమామ్‌ తెలిపారు. దేశంలో 50 మిలియన్లకు పైగా ప్రజలు

Published : 16 Dec 2021 22:51 IST

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో పోషకాహార లోపం కారణంగా  నిండా ఐదేళ్లు నిండకుండానే 1.77లక్షల మందికి పైగా పిల్లలు మరణించినట్లు  పాక్‌మంత్రి సయిద్‌ ఫక్కార్‌ ఇమామ్‌ తెలిపారు. దేశంలో 50 మిలియన్లకు పైగా ప్రజలు సూక్ష్మ పోషకాల్లో ప్రధానమైన జింక్‌ లోపంతో బాధపడుతున్నారని వెల్లడించారు. జింక్‌ లోపంపై జరిగిన  ’బయోఫర్టిఫి కేషన్‌ ఆఫ్‌ జింక్ వీట్‌‌‘ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ  ఈ విషయాలను వెల్లడించారు. సూక్ష్మ పోషక లోపం దేశంలో విస్తృతంగా ఉన్నట్లు పిల్లల్లో రోగ నిరోధక శక్తి, పెరుగుదల, మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఓ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.పోషకాహార లోపం అధిగమించేందుకు దేశంలో హార్వెస్ట్‌ ప్లస్‌ సహకారంతో జింక్‌ అధికంగా లభించే మూడు రకాల బయోఫోర్టిఫైడ్‌ గోధుమ రకాలను దేశంలో సాధారణ సాగుకోసం విస్తృతంగా అందిస్తున్నట్లు  తెలిపారు. హార్వెస్ట్‌ ప్లస్‌ సహకారంతో ఈఏడాది 3.60 లక్షల హెక్టార్లలో బయోఫోర్టిఫైడ్‌ గోధుమ రకాలు సాగుచేసినట్లు పేర్కొన్నారు. దేశంలో బయోఫోర్టిఫి కేషన్‌ బాగా అభివృద్ధి చెందుతోందని  దేశంలోని పిల్లల్లో జింక్‌లోపం, కుంగుబాటును తగ్గించడంలో సహాయపడుతుందని వెల్లడించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని