lightning: పిడుగు పాటుకు 10మంది మృత్యువాత

పిడుగుపాటుకు బిహార్‌లో పది మంది బలైపోయారు.

Updated : 07 Jul 2024 22:19 IST

పట్నా: ఉరుములు మెరుపులతో కూడిన పిడుగుల వర్షాలు బిహార్‌ ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నాయి. ఆ రాష్ట్రంలో పిడుగు పాటుతో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గత రెండు వారాల క్రితం పిడుగులు పడి దాదాపు 40మంది మృతిచెందగా.. తాజాగా మరో 10 మంది బలైపోయారు. గడిచిన 24గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల పిడుగులు పడిన ఘటనల్లో పది మంది మృత్యువాత పడినట్లు బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్‌ కార్యాలయం వెల్లడించింది.  నలంద జిల్లాలో ఇద్దరు మృతిచెందగా.. వైశాలి, భాగల్‌పుర్‌, సహస్ర, రోహ్తాస్‌, సరన్‌, జమూయి, భోజ్‌పుర్‌, గోపాల్‌గంజ్‌లలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచినట్లు పేర్కొంది. 

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత

మరోవైపు, పిడుగుపాటు ఘటనల్లో మృతుల కుటుంబాలకు సీఎం నీతీశ్ కుమార్‌ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.4లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని