100 మంది రైతులపై రాజద్రోహం కేసు

హరియాణాకు చెందిన 100 మంది రైతులపై స్థానిక పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు.

Published : 15 Jul 2021 20:26 IST

చండీగఢ్‌: హరియాణాకు చెందిన 100 మంది రైతులపై స్థానిక పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. నూతన వ్యవసాయ చట్టాల విషయంలో భాజపా- జేజేపీ నేతల వైఖరిని నిరసిస్తూ ఈ నెల 11న రైతులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్‌ రణ్‌బీర్‌ గంగ్వా వాహనాన్ని ధ్వంసం చేశారన్న అభియోగాలపై అదే రోజు వీరిపై రాజద్రోహం కేసు నమోదైంది. అలాగే రైతులపై హత్యాయత్నం అభియోగాలు కూడా మోపారు.

రైతులపై కేసు పెట్టడాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా ఖండించింది. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న హరియాణా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము పోరాడుతుండడం వల్లే కక్ష సాధింపులో భాగంగా ఈ కేసులు మోపుతున్నారని ఆరోపించింది. రాజద్రోహం కేసులకు వీలు కల్పిస్తున్న సెక్షన్‌ 124ఏ పై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసిన వేళ రైతులపై ఈ కేసులు నమోదు అంశం వెలుగులోకి రావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని