Gold smuggling: భారత్‌-చైనా సరిహద్దులో 108 కిలోల బంగారం పట్టివేత!

భారత్‌- చైనా సరిహద్దులో అక్రమంగా రవాణా చేస్తున్న 108 కిలోల బంగారాన్ని భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Updated : 10 Jul 2024 17:10 IST

లద్దాఖ్‌: భారత్‌- చైనా సరిహద్దు (Indo China border)లో అక్రమంగా రవాణా చేస్తున్న 108 కిలోల బంగారాన్ని భద్రతాదళం స్వాధీనం చేసుకొంది. ముగ్గురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటన తూర్పు లద్దాఖ్‌లో చోటు చేసుకొంది.

జులై 9న తూర్పు లద్దాఖ్‌లో ఇండో- టిబెటన్‌ బార్డర్‌ పోలీసు (ఐటీబీపీ) బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మగ్లింగ్‌ గురించి సమాచారం అందడంతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించారు. సోదాలు చేయగా 108 కిలోల బంగారు కడ్డీలతో పాటు రెండు మొబైల్‌ ఫోన్లు, బైనాక్యులర్‌, రెండు కత్తులు, చైనాకు చెందిన కొన్ని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీబీపీ వెల్లడించింది. ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపింది.

ముంబయి హిట్‌ అండ్‌ రన్ కేసు.. పబ్‌ పైకి బుల్డోజర్‌

ఇందులో ఇద్దరు లద్దాఖ్‌లోని న్యోమా ప్రాంతానికి చెందినవారిగా భద్రతా దళాలు గుర్తించాయి. ఆ ప్రాంతంలో ఇంత భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని