#Update: కొండచరియలు విరిగి పడిన ఘటనలో 11కు చేరిన మృతుల సంఖ్య

Himachal Pradesh Landslide: హిమాచల్‌ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది.

Published : 12 Aug 2021 01:25 IST

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. 14 మంది గాయపడ్డారు. మరో 30 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. కొండచరియల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

కిన్నౌర్‌ జిల్లా రెకాంగ్‌ పియో - సిమ్లా హైవేపై బుధవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిన్నౌర్‌ నుంచి సిమ్లాకు వెళ్తున్న హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వ రవాణా శాఖకు చెందిన ఓ ప్రయాణికుల బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు కొండచరియల కింద చిక్కుకున్నట్లు ఐటీబీపీ పోలీసులు వెల్లడించారు. ప్రయాణ సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలిలో ఐటీబీపీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా ఆరా తీశారు. హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌తో ఫోన్లో మాట్లాడి కేంద్రం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని