Cheetahs: ఫిబ్రవరి 18న భారత్‌కు 12 చిరుతలు

దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు రావాల్సిన 12 చిరుతలు ఈ నెల 18న కునో నేషనల్‌ పార్కుకు చేరుకోనున్నాయి. తొలుత ఇవి వాయుమార్గం ద్వారా గ్వాలియర్‌కు చేరుకుంటాయి అధికారులు తెలిపారు. 

Updated : 11 Feb 2023 23:35 IST

శ్యోపుర్‌: దక్షిణాఫ్రికాతో ఒప్పందంలో భాగంగా భారత్‌కు రావాల్సిన 12 చిరుతలు ఈ నెల 18న కునో నేషనల్‌ పార్కుకు చేరుకోనున్నాయని అటవీ ఉన్నతాధికారి ఒకరు శనివారం స్పష్టం చేశారు. తొలుత ఇవి వాయుమార్గం ద్వారా గ్వాలియర్‌కు చేరుకుంటాయని, అక్కడి నుంచి కునోకు వస్తాయని తెలిపారు. వాటిలో ఆడవి, మగవి ఎన్ని ఉన్నాయనే విషయం తనకు తెలియదని వెల్లడించారు. నిబంధనల ప్రకారం వాటిని ఒక నెల క్వారంటైన్‌లో ఉంచుతామని అధికారి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని