పోలియో చుక్కలకు బదులు.. శానిటైజర్!

మహారాష్ట్రలో పల్స్‌ పోలియో కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంతో అపశృతి చోటుచేసుకుంది. చిన్నారులకు ఆరోగ్య సిబ్బంది పోలియో చుక్కలకు బదులుగా హ్యాండ్‌ శానిటైజర్‌ వేశారు. ఈ ఘటన యావత్మాల్‌ జిల్లాలోని

Updated : 02 Feb 2021 16:18 IST

యావత్మాల్‌: మహారాష్ట్రలో పల్స్‌ పోలియో కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంతో అపశృతి చోటుచేసుకుంది. చిన్నారులకు ఆరోగ్య సిబ్బంది పోలియో చుక్కలకు బదులుగా హ్యాండ్‌ శానిటైజర్‌ వేశారు. ఈ ఘటన యావత్మాల్‌ జిల్లాలోని కప్సికోప్రి గ్రామంలో  చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం దేశ వ్యాప్తంగా పోలియో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభమైంది. ఇందులో భాగంగా భాన్‌బోరా ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని కప్సికోప్రి గ్రామంలో ఐదేళ్లు లోపు వయస్సు ఉన్న 12మంది చిన్నారులకు వ్యాక్సిన్‌కు బదులుగా ఆరోగ్య సిబ్బంది శానిటైజర్‌ చుక్కలు వేశారు. చిన్నారులు అస్వస్థతకు గురవ్వడంతో వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు జిల్లా అధికారులు వెల్లడించారు. 

ఈ ఘటనపై యావత్మాల్‌ జిల్లా పరిషత్‌ సీఈవో శ్రీకృష్ణ పంచాల్‌ మాట్లాడుతూ.. ఈ చిన్నారులంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో పీహెచ్‌సీ వద్ద ఒక వైద్యుడు, అంగన్‌వాడీ కార్యకర్త, ఆశా వాలంటీర్‌ ఉన్నారన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోదంని, ఆ ముగ్గురినీ సస్పెండ్‌ చేసేందుకు ఆదేశాలు జారీచేయనున్నట్టు తెలిపారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని