ఆ సీఎం సెక్యూరిటీలో 13మందికి కరోనా!

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా.....

Published : 18 Aug 2020 18:17 IST

సిమ్లా: దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ భద్రతా సిబ్బందిలో 13మందికి కరోనా సోకడం కలకలం రేపింది. ఇటీవల కొందరు సిబ్బంది కొవిడ్‌ బారిన పడగా.. తాజాగా మరికొంతమందికీ ఈ వైరస్ సోకింది. దీంతో ఇప్పటివరకు సీఎం సిబ్బందిలో కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య 13కి చేరింది. వీరిలో 12మంది భద్రతా సిబ్బంది కాగా.. ఒకరు సీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు సిమ్లా చీఫ్‌ మెడికల్‌ అధికారి డాక్టర్‌ సురేఖ చోప్రా వెల్లడించారు.

 హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 4208 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 2835మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 17మంది మరణించారు. ప్రస్తుతం 1300లకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని