Coronavirus: రెండో బూస్టర్‌పై ప్రభుత్వ వర్గాలు ఏమన్నాయంటే..?

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉంది. అయితే ప్రపంచ దేశాల్లో వ్యాప్తి దృష్ట్యా రెండో బూస్టర్‌పై చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. 

Published : 03 Jan 2023 11:54 IST

దిల్లీ: చైనా(China)తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా(Corona Virus) వ్యాప్తి చెందుతోంది. మనదేశంలో కూడా ఒమిక్రాన్(Omicron), దాని ఉపరకాలు ఉనికిలో ఉన్నాయి. కానీ వాటి వల్ల తీవ్రస్థాయి వ్యాధి లక్షణాలు, ఆసుపత్రి చేరికల్లో మాత్రం పెరుగుదల లేదు. అయితే అంతర్జాతీయంగా కొవిడ్ ఇంకా భయపెడుతోన్న తరుణంలో రెండో బూస్టర్‌ డోసు గురించి చర్చ నడుస్తోంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ‘ప్రస్తుతానికి రెండో బూస్టర్ డోసు అవసరం లేదు. మొదట మనం దేశంలో ఇప్పటికే ప్రారంభించిన బూస్టర్ డోసు డ్రైవ్‌ను పూర్తి చేయాలి’ అని తెలిపాయి. ఇప్పటి వరకూ దేశంలో పంపిణీ చేసిన డోసుల సంఖ్య 220 కోట్లు దాటింది.

24 గంటల్లో కరోనా గణాంకాలివే..

కొత్త కేసులు: 134

రోజువారీ పాజిటివిటీ రేటు: 0.09 శాతం

క్రియాశీల కేసులు: 2,582(0.01శాతం)

రికవరీ రేటు: 98.8శాతం

మొత్తంగా పంపిణీ అయిన డోసులు: 220.11 కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని