Uttarakhand: అలకనంద నదిలో పడ్డ టెంపో

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై వెళ్తున్న టెంపో వాహనం శనివారం జారి అలకనంద నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 14 మంది మరణించగా 12 మంది గాయపడ్డారు.

Published : 16 Jun 2024 05:13 IST

14 మంది దుర్మరణం
12 మందికి గాయాలు

రుద్ర ప్రయాగ్‌: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై వెళ్తున్న టెంపో వాహనం శనివారం జారి అలకనంద నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 14 మంది మరణించగా 12 మంది గాయపడ్డారు. వారంతా చోప్టాకు వెళ్తున్న టూరిస్టులని గర్వాల్‌ ఐజీ కేఎస్‌ నాగ్‌న్యాల్‌ తెలిపారు. వాహనంలో 26 మంది ఉన్నారని వెల్లడించారు. బాధితులు దిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్‌కు చెందినవారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని హెలికాప్టర్‌ అంబులెన్సులో రిషీకేశ్‌లోని ఎయిమ్స్‌లో చేర్చారు. ఉదయం 11 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్‌ సింగ్‌ తెలిపారు. వాహనం 200 మీటర్ల లోతులో ఉన్న నదిలో పడిపోయిందని చెప్పారు. వాహనంలో నుంచి ఒక మహిళ దూకారని, 80 మీటర్ల లోతులోని పొదల్లో చిక్కుకోవడంతో ఆమెను కాపాడామని సహాయక సిబ్బంది తెలిపారు. 

-  ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని