Pegasus: పెగాసస్‌పై చర్చ జరపాల్సిందే.. అమిత్‌ షా సమాధానం ఇవ్వాల్సిందే

దేశ భద్రతతో ముడిపడి ఉన్న పెగాసస్ హ్యాకింగ్‌పై పార్లమెంట్‌లో చర్చజరపాలని 14 విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమాధానం ఇవ్వాలని పట్టుబట్టాయి. ఈ విషయంలో ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శిస్తూ.. ఆ పార్టీలు బుధవారం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. 

Published : 04 Aug 2021 16:14 IST

సంయుక్త ప్రకటన విడుదల చేసిన 14 విపక్ష పార్టీలు

దిల్లీ: దేశ భద్రతతో ముడిపడి ఉన్న పెగాసస్ హ్యాకింగ్‌పై పార్లమెంట్‌లో చర్చజరపాలని 14 విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమాధానం ఇవ్వాలని పట్టుబట్టాయి. ఈ విషయంలో ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శిస్తూ.. ఆ పార్టీలు బుధవారం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. 

‘పార్లమెంట్‌లో నిరంతర అంతరాయాలకు విపక్ష పార్టీలే కారణమని కేంద్రం తప్పుడు ప్రచారం చేయడం విచారకరం. ఉభయ సభల్లో కార్యకలాపాలు సజావుగా సాగకపోవడానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. అహంకారపూరితంగా, మొండిగా వ్యవహరిస్తోంది’ అంటూ ఆ ప్రకటనలో ప్రభుత్వ వైఖరిని నిందించాయి. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు పెగాసస్‌ హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెగాసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారిలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. అందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, పలువురు కేంద్రమంత్రులు, పాత్రికేయులు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. కేంద్రం మాత్రం వీటిని తప్పుడు ఆరోపణలని కొట్టిపారేసింది. మరోపక్క ఈ హ్యాకింగ్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీం అంగీకరించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు