Dasna Jail: ఈ జైల్లో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్‌

ఉత్తర ప్రదేశ్‌లోని గాజియాబాద్‌ జిల్లా జైల్లో 140 మందికి హెచ్‌ఐవీ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని జైలు సీనియర్‌ అధికారులు ధ్రువీకరించారు. వారికి ప్రత్యేక కేంద్రంలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 

Published : 19 Nov 2022 02:18 IST

ఘాజియాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ జిల్లా జైల్లో భారీ స్థాయిలో హెచ్‌ఐవీ (HIV) కేసులు వెలుగు చూశాయి. ఘాజియాబాద్‌లోని డాసనా జైలులో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్‌ నిర్ధారణ అయినట్లు సీనియర్‌ జైలు అధికారి వెల్లడించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, జైలుకి తరలించే ముందు ఖైదీలందరికీ  హెచ్‌ఐవీ పరీక్ష చేస్తామని చెప్పారు.

2016లో అక్కడి జైళ్లలో హెచ్‌ఐవీ స్క్రీనింగ్‌ క్యాంపులను రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ చేపట్టింది. అప్పట్లో కేవలం 49 మందికి మాత్రమే ఎయిడ్స్‌ ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా హెచ్‌ఐవీ, టీబీ పరీక్షలను తప్పనిసరిగా చేపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఖైదీకి హెచ్‌ఐవీ నిర్ధారణ అయితే, వారికి అక్కడే ఉండే ఇంటిగ్రేటెడ్‌ కౌన్సిలింగ్‌ అండ్‌ ట్రీట్మెంట్‌ సెంటర్లో (ఐసీటీసీ) ఏఆర్‌వీ చికిత్స అందిస్తున్నారు.

ఘాజియాబాద్‌ జైలుకు 1706 మంది ఖైదీల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం అక్కడ 5500 మంది ఉన్నట్లు సమాచారం. అందులో 140 మందికి హెచ్‌ఐవీ నిర్ధారణ కాగా వారిలో 35 మందికి క్షయ వ్యాధి (TB) కూడా సోకింది.  2016 నుంచి సరాసరి 120 నుంచి 150 మంది హెచ్‌ఐవీ సోకిన ఖైదీలు ఆ జైల్లో ఉంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని