Drugs: పండ్ల మాటున రవాణా.. రూ.1476 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత!

ముంబయిలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పండ్ల మాటున పెద్ద మొత్తంలో తరలిస్తోన్న డ్రగ్స్‌ను రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ మాదకద్రవ్యాల విలువ రూ.1476 కోట్లు ఉంటుందని అంచనా...

Published : 02 Oct 2022 01:29 IST

ముంబయి: మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకునేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబయిలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పండ్ల మాటున పెద్ద మొత్తంలో తరలిస్తున్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదకద్రవ్యాల విలువ రూ.1476 కోట్లు ఉంటుందని అంచనా. ముంబయిలోని వాశీలో ఓ ట్రక్కును అడ్డుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) అధికారులు.. అందులో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నారింజ పండ్ల డబ్బాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో 198 కిలోల నిషేధిత హై ప్యూరిటీ క్రిస్టల్ మెథాంఫెటమైన్(మెథ్‌), తొమ్మిది కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘పండ్లను తరలిస్తున్న డబ్బాల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నాం. దిగుమతిదారును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోంది’ అని డీఆర్‌ఐ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts