Lac: 14వ విడత కోర్‌కమాండర్‌ స్థాయి చర్చలు ప్రారంభం

భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై ఇరుదేశాల కోర్‌కమాండర్‌ స్థాయి చర్చలు బుధవారం మొదలయ్యాయి. చైనా వైపు మాల్డో స్థావరంలో

Published : 12 Jan 2022 14:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై ఇరుదేశాల కోర్‌కమాండర్‌ స్థాయి చర్చలు బుధవారం మొదలయ్యాయి. చైనా వైపు మాల్డో స్థావరంలో ఉదయం 10గంటలకు ఇవి ప్రారంభమైనట్లు రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి సానుకూల దృక్పథంతో పరిష్కారం కోసం ఈ చర్చలు ప్రారంభించినట్లు భారత వర్గాలు పేర్కొన్నాయి.

 ఈ సారి చర్చల్లో హాట్‌స్ప్రింగ్స్‌ వద్ద వివాదానికి పరిష్కారం లభించవచ్చని ఇరు వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పెట్రోలింగ్‌ పాయింట్‌ 15 వద్ద వేగంగా ఉద్రిక్తతలు తగ్గించడంపై దృష్టిపెట్టారు. భారత్‌ తరపున ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ కోర్‌ జీవోసీ లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిధ్యసేన్‌ గుప్తా హాజరు కానున్నారు. ఆయన గత చర్చల్లో పాలుపంచుకొన్నారు.

మరోపక్క ఈ చర్చలపై విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ మంగళవారం మాట్లాడుతూ ఇరు పక్షాలు మధ్య దౌత్య, సైనిక స్థాయిలో సంప్రదింపులు కొనసాగాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని