Ukraine crisis: ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయుల్లో ఇంకా 15-20 మంది ఎదురుచూపు!

రష్యా బలగాల దాడులతో గత 22 రోజులుగా దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌లో ఇంకా మిగిలిపోయిన భారతీయుల్లో 15 నుంచి 20 మంది ......

Published : 18 Mar 2022 01:44 IST

దిల్లీ: రష్యా బలగాల దాడులతో గత 22 రోజులుగా దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌లో ఇంకా మిగిలిపోయిన భారతీయుల్లో 15 నుంచి 20 మంది వచ్చేయాలనుకుంటున్నారని కేంద్రం వెల్లడించింది. స్వదేశానికి తరలింపు కోసం వారంతా ఎదురుచూస్తున్నట్టు పేర్కొంది. యుద్ధభూమిలో చిక్కుకున్న భారతీయుల్ని తరలించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్‌ గంగ’ కార్యక్రమం ఇంకా ముగిసిపోలేదని ఈ సందర్భంగా తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి మీడియాతో మాట్లాడారు.

‘‘ఉక్రెయిన్‌లో ఇంకా చిక్కుకుపోయిన వారికి సాధ్యమైన సాయం చేస్తాం. కొందరు ఇంకా ఖేర్సన్‌లో ఉన్నారు. ‘ఆపరేషన్‌ గంగ’ ఇంకా పూర్తయిపోలేదు. ఇప్పటివరకు ఉక్రెయిన్‌ నుంచి 22,500 మందికి పైగా తరలించాం. కానీ కొందరు వేరేచోట చిక్కుకుపోగా.. ఇంకొందరు వచ్చేందుకు ఇష్టపడలేదు. మా అంచనా ప్రకారం దాదాపు 15 నుంచి 20 మంది ఇక్కడకు వచ్చేయాలనుకుంటున్నారు. వాళ్లను తరలించేందుకు మార్గాల్ని అన్వేషిస్తున్నాం’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని