విరుధునగర్‌ ఘటనపై మోదీ, రాహుల్‌ విచారం 

తమిళనాడులోని విరుధునగర్‌ జిల్లాలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరినట్టు సమాచారం. చెన్నైకి 500 కి.మీల దూరంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో టపాసుల తయారీ కోసం రసాయనాలు కలుపుతుండ....

Published : 12 Feb 2021 21:11 IST

15కి చేరిన మృతులు..!

చెన్నై: తమిళనాడులోని విరుధునగర్‌ జిల్లాలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరినట్టు సమాచారం. చెన్నైకి 500 కి.మీల దూరంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో టపాసుల తయారీ కోసం రసాయనాలు కలుపుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని రాహుల్‌ గాంధీ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30గంటల సమయంలో ఈ పేలుడు చోటుచేసుకోగా.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. 

ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు తమిళనాడు సీఎం పళనిస్వామి పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలు; తీవ్ర గాయాలపాలైన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు పీఎంవో ట్వీట్‌ చేసింది.

ఇదీ చదవండి..

బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచార కేసులో ట్విస్ట్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని