అఫ్గాన్‌లో బాంబు పేలుడు.. 16 మంది మృతి

అఫ్గానిస్థాన్‌లో బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆదివారం ఆత్మాహుతిదాడిగా అనుమానిస్తున్న మినీబస్‌ బాంబు పేలుడు ఘటనలో 16 మంది మృతి చెందారు. 90 మందికి పైగా గాయపడ్డారు. వీళ్లలో చాలా మంది పరిస్థితి

Published : 18 Oct 2020 16:41 IST

90 మందికి పైగా గాయాలు 

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆదివారం ఆత్మాహుతిదాడిగా అనుమానిస్తున్న మినీ బస్‌ బాంబు పేలుడు ఘటనలో 16 మంది మృతి చెందారు. 90 మందికి పైగా గాయపడ్డారు. వీళ్లలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వివరించారు. ఆ దేశంలోని పశ్చిమ ఘోర్‌ ప్రావిన్స్‌లో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు ఉన్న మినీ బస్సు వల్ల పేలుడు సంభవించినట్లు స్థానిక అధికారులు నిర్ధరించారు. క్షతగాత్రులను గుర్తించే పనిలో ఉన్న అధికారులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకూ ప్రకటించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని