Bengal: చేపల వేటకు వెళ్లిన 18 మంది మత్స్యకారుల గల్లంతు

సముద్రంలో వేటకు వెళ్లిన 18 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. వారు వెళ్లిన  పడవ మునిగిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది........

Published : 20 Aug 2022 00:02 IST

కోల్‌కతా: సముద్రంలో వేటకు వెళ్లిన 18 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. వారు వెళ్లిన పడవ మునిగిపోవడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్‌ ప్రాంతానికి చెందిన 18మంది మత్స్యకారులు శుక్రవారం ఉదయం బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లారు. కాగా వారు వెళ్లిన పడవ సౌత్‌ 24 పరగణాస్‌ జిల్లా కాక్డివిప్‌ సమీపంలో ప్రమాదానికి గురై మునిగిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోస్ట్‌ గార్డులు, స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, మత్స్యకారులు సైతం వారికి సాయం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఒక్కరి జాడ కూడా తెలియరాలేదని స్థానికులు పేర్కొంటున్నారు. గాలింపు చర్యల కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని