Corona: ఐఐటీ మద్రాస్‌లో కరోనా కలకలం.. రెండ్రోజుల్లోనే 30 కేసులు..!

మద్రాస్‌ ఐఐటీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిన్న 12 మందికి కరోనా సోకగా.. తాజాగా మరో 18 మంది వైరస్ బారినపడ్డారు. దాంతో అక్కడ రెండు రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య 30కి చేరుకుంది

Published : 22 Apr 2022 14:07 IST

చెన్నై: మద్రాస్‌ ఐఐటీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిన్న 12 మందికి కరోనా సోకగా.. తాజాగా మరో 18 మంది వైరస్ బారినపడ్డారు. దాంతో అక్కడ రెండు రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య 30కి చేరుకుంది. ఈ మేరకు శుక్రవారం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న దేశం మొత్తం మీద 2,451 మందికి కరోనా సోకగా.. తమిళనాడులో ఆ సంఖ్య 39గా ఉంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే కొన్ని రాష్ట్రాలు మాస్కులు ధరించడంపై సడలింపులు ఇచ్చినప్పటికీ.. తమిళనాడు ప్రభుత్వం ఆ తరహా ప్రకటన చేయలేదు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించే విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దంటూ దిల్లీలో కేసులు పెరుగుతున్న విషయాన్ని గుర్తుచేసింది. అజాగ్రత్తగా ఉంటే ఇక్కడా అదే పరిస్థితి రావొచ్చని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని