18వేల కి.మీ రైల్వేమార్గం విద్యుద్దీక‌ర‌ణ‌ పూర్తి

2014 నుంచి 2020 మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 18,065 కిలో మీటర్ల రైల్వే మార్గం విద్యుద్దీకరణ జరిగిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్ పేర్కొన్నారు. దేశంలో ఇప్పటి వరకు 41,500 కిలో మీటర్ల రైల్వే మార్గం విద్యుద్దీకరణ పూర్తయిందని, అందులో ఎక్కువ శాతం.....

Published : 29 Nov 2020 23:44 IST

మోదీ పాలనలో ఎన్నో మైలురాళ్లు: పియూష్‌

న్యూదిల్లీ: 2014 నుంచి 2020 మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 18,065 కిలో మీటర్ల రైల్వే మార్గం విద్యుద్దీకరణ జరిగిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ పేర్కొన్నారు. దేశంలో ఇప్పటి వరకు 41,500 కిలో మీటర్ల రైల్వే మార్గం విద్యుద్దీకరణ పూర్తయిందని, అందులో ఎక్కువ శాతం మోదీ పాలనలో జరిగిందని పేర్కొన్నారు.

‘మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా మోదీ నాయకత్వంలో రైల్వే శాఖ అనేక మైలురాళ్లను చేరుకుంది. గత ఆరేళ్లలో 18,065 కిలో మీటర్ల మార్గం విద్యుద్దీకరణ పూర్తయింది. ఇది 2008-2014తో పోల్చితే 2014-20లో 371 శాతం పెరిగింది’ అని పీయూష్‌ ట్వీట్‌ చేశారు.

2004-2009లో 2,150 కి.మీ, 2009-2014లో 3,038 కి.మీ, 2014-2019లో 13,687 కి.మీటర్ల రైల్వే మార్గం విద్యుద్దీకరణ జరిగిందని.. 2019-2024 నాటికి 28,143 కి.మీ రైల్వే మార్గం విద్యుద్దీకరణ పూర్తవుతుందని తెలిపే ఇన్ఫోగ్రాఫిక్స్‌ను మంత్రి షేర్‌ చేశారు. ఈ నేపథ్యంలో 2019 నుంచి 2020 అక్టోబరు వరకు 5,642 కి.మీ విద్యుద్దీకరణ పని పూర్తయింది పేర్కొన్నారు. ప్రత్యేకించి దేశ రాజధాని పరిసరాల్లోని రైల్వే మార్గం విద్యుద్దీకరణ వల్ల డీజిల్‌ ఇంజిన్ల నుంచి విముక్తి లభిస్తుందని, దీని వల్ల గాలి నాణ్యత పెరిగి కాలుష్యం తగ్గుతుందని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని