JK: ఈ ఏడాది 182 మంది ఉగ్రవాదుల హతం: కశ్మీర్ డీజీపీ

2021లో జమ్మూ కశ్మీర్‌లో నిర్వహించిన 100 విజయవంతమైన ఆపరేషన్లలో 44 కీలక ఉగ్రవాదులు సహా 182 మంది ఉగ్రవాదులు హతమయ్యారని డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌..

Updated : 14 May 2022 10:59 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది నిర్వహించిన 100 విజయవంతమైన ఆపరేషన్లలో 44 కీలక ఉగ్రవాదులు సహా 182 మంది ఉగ్రవాదులు హతమయ్యారని డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ వెల్లడించారు. శుక్రవారం డీజీపీ మాట్లాడుతూ.. ఈ ఏడాది కేంద్ర పాలిత ప్రాంతంలో 134 మంది యువకులు తీవ్రవాద గ్రూపుల్లో చేరారని వారిలో 72 మందిని హతమార్చామని, 22 మందిని అరెస్ట్‌ చేశామని తెలిపారు.

ఈ ఏడాది చొరబాట్లు తగ్గాయని, కేవలం 34 మంది ఉగ్రవాదులు మాత్రమే చొరబడినట్లు డీజీపీ పేర్కొన్నారు. పాంథా చౌక్‌లో పోలీసుల బస్సుపై దాడికి పాల్పడిన జేఈఎంకి చెందిన 9 మంది ఉగ్రవాదులను 24 గంటల్లో హతమార్చినట్లు తెలిపారు. హైదర్‌పొరా ఎన్‌కౌంటర్‌ గురించి దిల్‌బాగ్‌సింగ్‌ మాట్లాడుతూ.. ఎన్‌కౌంటర్‌ పారదర్శకంగా జరిగిందని పేర్కొన్నారు. బలగాలకు క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్న రాజకీయ నేతలు దర్యాప్తు బృందాలకు ఆధారాలు సమర్పించాలని కోరారు. రాజకీయ నేతల వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నామని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని