
Army Helicopter: సైనిక హెలికాప్టర్ కుప్పకూలి ఇద్దరు పైలట్ల మృతి
ఉదంపుర్: జమ్ముకశ్మీర్‌లోని ఉదంపుర్ జిల్లాలో సైనిక హెలికాప్టర్ కూలిపోయి ఇద్దరు పైలట్లు మృతిచెందారు. శివ్ గర్‌ధర్ ప్రాంతంలోని కొండ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని , స్థానికుల సాయంతో సహాయ చర్యలు చేపట్టారు. హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయ చర్యలు ఆలస్యమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
పైలట్లు ఇద్దరూ మేజర్ ర్యాంక్ అధికారులే అని ఓ సీనియర్ ఆర్మీ అధికారి వెల్లడించారు. ఆసుపత్రికి తరలించేలోపే వారు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి జితేంద్రసింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెలికాప్టర్ దుర్ఘటన కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి
Advertisement