CBI: రక్షణ రహస్యాల లీక్‌ కేసు.. ఇద్దరు కమాండర్లు సహా ఆరుగురిపై ఛార్జిషీట్‌..!

భారత నావికాదళంలోని జలాంతర్గాములకు సంబంధించిన కీలక రహస్యాల లీక్‌ కేసులో ఆరుగురిపై సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

Published : 02 Nov 2021 22:30 IST

దిల్లీ: భారత నావికాదళంలోని జలాంతర్గాములకు సంబంధించిన కీలక రహస్యాల లీక్‌ కేసులో ఆరుగురిపై సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. సర్వీసులో ఉన్న ఇద్దరు కమాండర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. నావికా దళానికి చెందిన కిలో క్లాస్‌ జలాంతర్గములకు చెందిన సమాచారం బయట వ్యక్తులకు అందజేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ సబ్‌మెరైన్లలోని ఎంఆర్‌సీఎల్‌ ప్రోగ్రాం వివరాలను లీక్‌ చేసినట్లు సీబీఐ పేర్కొంది. సర్వీసులో ఉన్న అధికారులు కీలక సమాచారాన్ని విశ్రాంత అధికారులకు అందజేశారు. ఆ విశ్రాంత అధికారులు దక్షిణ కొరియా కంపెనీ కోసం పనిచేస్తున్నారు. తాజాగా భారత నావికాదళం సరికొత్త జలాంతర్గాములను నిర్మించే ప్రాజెక్టును చేపట్టింది. దీనిలో కాంట్రాక్టు కోసం దక్షిణ కొరియా కంపెనీ కూడా ప్రయత్నిస్తోంది.

సెప్టెంబర్‌ 3న విశ్రాంత నేవీ అధికారులు రణదీప్‌ సింగ్‌, ఎస్‌జే సింగ్‌లను అరెస్టు చేయడంతో అసలు విషయం బయటపడింది. వీరిలో కొమోడోర్‌ రణ్‌దీప్‌సింగ్‌ ఇంట్లో తనిఖీలు నిర్వహించి రూ.2 కోట్ల నగదును సీబీఐ స్వాధీనం చేసుకొంది. ఆ తర్వాత నావికాదళ పశ్చిమ కమాండ్‌లోని కమాండర్‌ అజిత్‌ కుమార్‌ పాండేను అరెస్టు చేశారు. దాదాపు డజను మందికి ఈ కేసుతో సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని