Jammu Kashmir: భద్రతాదళాల ఆపరేషన్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూ- కశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగిపోయాయి! దీంతో వారిని కట్టడి చేసేందుకు భద్రతాదళాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో శ్రీనగర్‌ సమీపంలోని ఖ్రూ ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ప్రాంతంలో..

Published : 20 Aug 2021 17:17 IST

శ్రీనగర్‌: జమ్మూ- కశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు భద్రతాదళాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో శ్రీనగర్‌ సమీపంలోని ఖ్రూ ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ప్రాంతంలో ముష్కరులు దాగి ఉన్నారనే సమాచారం మేరకు గురువారం రాత్రి ఆపరేషన్‌ మొదలుపెట్టారు. శుక్రవారం ఉదయం హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. కశ్మీర్‌లో 24 గంటల వ్యవధిలో ఇది రెండో ఎన్‌కౌంటర్‌ కావడం గమనార్హం. రాజౌరి జిల్లాలోని తానామండీ ప్రాంతంలో గురువారం ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి(జేసీవో) అమరుడైన విషయం తెలిసిందే. ఇదే దాడిలో ఒక ఉగ్రవాది సైతం హతమయ్యాడు. కుల్గాం జిల్లాలో జరిగిన మరో ఘటనలో అప్నీ పార్టీకి చెందిన నేత గులాం హసన్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. సాయంత్రం శ్రీనగర్ డౌన్‌టౌన్‌లో జరిపిన గ్రెనేడ్ దాడిలో ఇద్దరు భద్రతా దళాల సిబ్బంది, ఒక పౌరుడు గాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని