China Marathon: 21 మంది రన్నర్లు మృతి!
చైనాలో నిర్వహించిన మారథాన్లో విషాధం చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా 100 కి.మీ మౌంటెన్ రేసులో పాల్గొన్న వారిలో 21 మంది మృతి చెందారు.
ప్రతికూల వాతావరణంతో మారథాన్లో విషాదం
బీజింగ్: చైనాలో నిర్వహించిన మారథాన్లో విషాదం చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా 100 కి.మీ మౌంటెన్ రేసులో పాల్గొన్న వారిలో 21 మంది మృతి చెందారు. ఈ మారథాన్లో మొత్తం 172 మంది పాల్గొనగా.. వారిలో 151 మంది సురక్షితంగా బయటపడినట్లు చైనా మీడియా వెల్లడించింది.
చైనాలో గాన్సు ప్రావిన్సుకు చెందిన బయిన్ నగరంలోని ఓ పర్యాటక ప్రదేశంలో 100కి.మీ పర్వత మారథాన్ ఏర్పాటు చేశారు. ఈ మారథాన్ సాగే ప్రాంతం మొత్తం దాదాపు యెల్లో నదీ తీర అటవీ ప్రాంతంలోనే ఉంది. ఈ పరుగులో పాల్గొన్న రన్నర్లకు 20 నుంచి 31కి.మీ మధ్యకు చేరుకున్న అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ప్రతికూల వాతావరణం ఎదురైంది. ఒక్కసారిగా వడగళ్లు, మంచు వర్షం, భీకర చలిగాలులు రావడంతో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో రేసులో పాల్గొన్న రన్నర్లలో కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సహాయం కోసం వెంటనే కొందరు రన్నర్లు సమీప రెస్క్యూ కేంద్రాలకు తెలియజేశారు. సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని పలువురి రక్షించినప్పటికీ.. అప్పటికే దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు బయిన్ నగర మేయర్ ఝాంగ్ షూచెన్ పేర్కొన్నారు. మరో ఎనిమిది స్వల్ప అస్వస్థతతో కోలుకుంటున్నారని తెలిపారు. ఈ మారథాన్ నిర్వాహకుడిగా క్షమాపణ కోరుతున్నట్లు ప్రకటించిన మేయర్, మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
పర్వతాలతో కూడుకున్న యెల్లో రివర్ స్టోన్ అటవీ ప్రాంతం గాన్సు ప్రావిన్సులో ఓ పర్యాటక కేంద్రంగా ఉంది. చైనా టెలివిజన్ షోలు, సినిమా చిత్రీకరణ ఎక్కువగా సాగే ఈ ప్రావిన్సును గతంలో వరదలు ముంచెత్తాయి. ఇక భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే బయిన్ గనరంలో 2010లో నగరంలో వచ్చిన వరదల ధాటికి వెయ్యి మంది చనిపోయినట్లు చైనా మీడియా పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
SKY: వాషింగ్టన్ సుందర్ విషయంలో నాదే తప్పు.. వైరల్గా మారిన సూర్య వ్యాఖ్యలు
-
Politics News
Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్
-
Movies News
Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
-
Sports News
IND vs NZ: చాహల్ విషయంలో హార్దిక్ నిర్ణయం సరైంది కాదు: గంభీర్
-
World News
Pakistan: మసీదులో బాంబు పేలుడు.. 28మంది మృతి, 150మందికి గాయాలు