Alert: అఫ్గాన్‌ నుంచి ఆ 25మంది భారత్‌లోకి చొరబడే అవకాశం.. నిఘా వర్గాలు

ఐసిస్‌ సానుభూతిపరుల నుంచి భారత్‌కు ముప్పు పొంచి ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అఫ్గాన్‌ జైళ్ల నుంచి గత...

Updated : 10 Sep 2021 22:19 IST

దిల్లీ: ఐసిస్‌ సానుభూతిపరుల నుంచి భారత్‌కు ముప్పు పొంచి ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అఫ్గాన్‌ జైళ్ల నుంచి గత నెలలో 25 మంది ఐసిస్‌ సానుభూతిపరులు విడుదలయ్యారని, వారు భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు తెలిపాయి. వీరంతా ఐసిస్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్న వ్యవహారంలో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) జాబితాలో ఉన్నవారే. నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అఫ్గానిస్థాన్‌ నుంచి భారత్‌లోకి చొరబడకుండా ఇప్పటికే విమానాశ్రయాలు, ఓడరేవుల వద్ద నిఘా పెంచింది. ఈ 25 మందిలో దాదాపు అంతా కేరళకు చెందినవారే.  ఐసిస్‌ పట్ల ఆకర్షితులై 2016 - 2018 మధ్య కాలంలో పలు సందర్భాల్లో ఆ ఉగ్ర సంస్థలో చేరేందుకు అఫ్గాన్‌కు వెళ్లారు. ఇటీవల అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల స్వాధీనంలోకి వెళ్లడంతో పలు జైళ్లలో ఉన్న ఐసిస్‌ ఉగ్రవాదులను విడిచి పెట్టిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని