United Nations: 2.5కోట్ల మంది చిన్నారులు మళ్లీ బడి ముఖం చూడరేమో..!

కరోనా మహమ్మారి ప్రపంచ గమనంపై పెను ప్రభావాన్ని చూపింది. అన్నింటిలోకెల్లా విద్యావ్యవస్థను సంక్షోభంలోకి నెట్టి.. చిన్నారుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. ఏడాదిన్నరగా విద్యార్థులు పాఠశాలలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. దీనిపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2.5 కోట్ల మంది చిన్నారులు మళ్లీ పాఠశాలల ముఖం చూడకపోవచ్చని ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. 

Updated : 03 Aug 2021 04:29 IST

న్యూయార్క్‌: కరోనా మహమ్మారి ప్రపంచ గమనంపై పెను ప్రభావాన్ని చూపింది. అన్నింటిలోకెల్లా విద్యావ్యవస్థను సంక్షోభంలోకి నెట్టి.. చిన్నారుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. ఏడాదిన్నరగా విద్యార్థులు పాఠశాలలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. దీనిపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2.5 కోట్ల మంది చిన్నారులు మళ్లీ పాఠశాలల ముఖం చూడకపోవచ్చని ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. 

‘మనం విద్యాసంక్షోభానికి మధ్యలో ఉన్నాం. కరోనా కారణంగా పాఠశాలలు మూసివేయడంతో 15.6 కోట్ల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. 2.5 కోట్ల మంది చిన్నారులు తిరిగి బడుల ముఖం చూడకపోవచ్చు. ఈ ఉత్పాతం నుంచి బయటపడాలంటే.. డిజిటల్ లెర్నింగ్ సహా విద్యావ్యస్థకు సంబంధించిన పలు విభాగాలపై పెట్టుబడులు అవసరం’ అని గుటెరస్ సూచించారు. మహమ్మారి వేళ.. పిల్లలు పాఠశాలలకు దూరంగా ఉండటంతో వారు హింస, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు పెరిగాయని ఆయన గతంలో హెచ్చరించారు. కొవిడ్ రికవరీ ప్రణాళికలో చిన్నారుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

ఇదిలా ఉండగా.. ఒకవైపు ప్రపంచ దేశాలు కరోనా టీకా కార్యక్రమంపై దృష్టిసారించగా, మరోపక్క డెల్టా వేరియంట్ విజృంభిస్తూ, ప్రపంచాన్ని మరోసారి ఆంక్షలవైపు మళ్లిస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు 20 కోట్లకు సమీపిస్తుండగా.. 40లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని