LoC: నియంత్రణ రేఖ వద్ద 250 మంది ఉగ్రవాదులు!
భారత్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి సుమారు 250 మంది ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రస్తుతం వీరంతా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని పలు లాంచ్ ప్యాడ్ల వద్ద మోహరించినట్టు
భారత్‌లో చొరబాటుకు ప్రయత్నాలు
నిఘా వర్గాల హెచ్చరిక
కేరన్ సెక్టార్ (జమ్మూకశ్మీర్): భారత్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి సుమారు 250 మంది ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రస్తుతం వీరంతా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని పలు లాంచ్ ప్యాడ్ల వద్ద మోహరించినట్టు పేర్కొంది. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. నియంత్రణ రేఖ వెంబడి గస్తీని ముమ్మరం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా తిప్పికొట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కశ్మీర్ ఉత్తరభాగంలోని కేరన్ పోస్టు వద్ద నిఘాను తీవ్రం చేసింది. శత్రువులతో పోరాడుతున్న సైనికులకు ఇప్పుడిప్పుడే శీతకాల ప్రభావం కూడా ఎదురవుతోంది. చలిగాలులు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఉగ్రవాదుల చొరబాట్లు తగ్గినా, మాదక ద్రవ్యాలు మాత్రం భారీగానే దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నట్టు సైనిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. డ్రగ్స్ ద్వారా సంపాదించిన డబ్బులతో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, దీన్ని నియంత్రించేందుకు గట్టి కృషి చేస్తున్నామని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. ఉగ్రవాదులే కాకుండా, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు భారత్‌లోకి చొరబడకుండా సరిహద్దుల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్టు తెలిపారు.
బీఎస్ఎఫ్ బలగాలపై పాక్ రేంజర్ల కాల్పులు
కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ మరోసారి తూట్లు పొడిచింది. పాక్ రేంజర్లు మంగళవారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆర్నియా సెక్టార్ వద్ద భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. అయితే, దీనికి తమ బలగాలు గట్టి సమాధానం ఇచ్చినట్టు బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్పీఎస్ సంధూ తెలిపారు. ఉభయపక్షాల మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగినా, భారతీయులెవరికీ ప్రాణనష్టం సంభవించలేదని వివరించారు. ఘటన జరిగిన వెంటనే సీనియర్ అధికారులు సరిహద్దు సమీపంలోని చినాజ్ ఔట్‌పోస్ట్ వద్దకు చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు చెప్పారు.
ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరుల హతం
శ్రీనగర్:జమ్మూ-కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడి పోష్కీరిలో ముష్కరులు దాగి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతాదళాలు మంగళవారం ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ఎదురుకాల్పులు జరిపినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు మృతి చెందారని.. వారి వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: పూజాహెగ్డే ‘వెడ్డింగ్ ఫీవర్’.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు
-
Politics News
YSRCP: ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిరూపిస్తా: వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sports News
IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే టెస్టు సిరీస్ ఆడటమా..?: ఆసీస్ క్రికెట్ దిగ్గజం
-
Movies News
Kantara: అందుకే ‘కాంతార’ ఆస్కార్‌కు నామినేట్ కాలేకపోయింది: విజయ్ కిరగందూర్
-
World News
Pakistan: పాకిస్థాన్‌పై మరో పిడుగు.. త్వరలో ఇంధన సంక్షోభం..!
-
Sports News
Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషభ్ పంత్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి ఎప్పుడంటే?