JK: 26 మంది విదేశీ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాం: పోలీసులు

జమ్మూకశ్మీర్‌లో జనవరి నుంచి ఇప్పటివరకు 26మంది విదేశీ ఉగ్రవాదుల్ని చంపినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది తొలి ఐదు మాసాల్లోనే......

Published : 26 May 2022 17:23 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. జనవరి నుంచి ఇప్పటివరకు 26మంది విదేశీ ఉగ్రవాదుల్ని చంపినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది తొలి ఐదు మాసాల్లోనే లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థలకు చెందిన ముష్కరులను మట్టుబెట్టినట్టు కశ్మీర్‌ జోన్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. గురువారం కుప్వారా జిల్లాలో ముష్కరుల చొరబాటు ప్రయత్నాన్ని తిప్పికొట్టిన భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను అంతం చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు 26మంది విదేశీ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టు తెలిపారు. వీరిలో 14 మంది మసూద్‌ అజహర్‌కు చెందిన జైషే మహమ్మద్‌ సంస్థకు చెందిన వారు కాగా.. మిగతా 12 మంది హఫీజ్‌ మహమ్మద్‌ సయీద్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందినవారిగా గుర్తించామన్నారు. బుధవారం కూడా బారాముల్లా జిల్లా క్రీరి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. ఇటీవల కశ్మీరీ పండిట్‌ రాహుల్ భట్‌ అనే ఉద్యోగిని కార్యాలయంలోనే కాల్చి చంపిన కేసుతో ప్రమేయం ఉన్న ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మే 13న బందీపొరా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైనట్టు ఐజీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని