
Odisha: ఒకే పాఠశాలలో 26 మంది విద్యార్థినులకు కరోనా!
భువనేశ్వర్: ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో.. ఒకే పాఠశాలకు చెందిన 26 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. థాకుర్‌ముండాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఈ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 259 మంది విద్యార్థినులు, 20 మంది సిబ్బంది ఉన్న ఈ పాఠశాలలో పెద్ద ఎత్తున కేసులు బయటపడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే.. వెంటనే బాధితులను తరలించేందుకు వీలుగా పాఠశాల వద్ద అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. పాఠశాలకు వస్తున్న కొందరు బాలికలు స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు ఉపాధ్యాయులు గమనించారు. బాధిత విద్యార్థినులకు గత గురువారం కరోనా పరీక్షలు నిర్వహించగా.. 26 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు వెల్లడైంది. ప్రస్తుతం బాధితులందరినీ పాఠశాల ప్రాంగణంలోనే ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
► Read latest National - International News and Telugu News