26,121 భారత వెబ్‌సైట్లను హ్యాక్‌ చేశారు!

గతేడాది భారత్‌కు చెందిన 26వేలకు పైగా వెబ్‌సైట్లను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రే గురువారం పార్లమెంట్‌కు తెలిపారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2020లో 

Published : 11 Feb 2021 22:28 IST

దిల్లీ: గతేడాది భారత్‌కు చెందిన 26వేలకు పైగా వెబ్‌సైట్లను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రే గురువారం పార్లమెంట్‌కు తెలిపారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2020లో ఎక్కువ సైబర్‌ దాడులు జరిగినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన హ్యాకర్లు ఈ దాడులు పాల్పడినట్లు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 

‘‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సీఈఆర్‌టీ-ఇన్‌) సమాచారం ప్రకారం.. 2020లో 26,121 భారత్‌ వెబ్‌సైట్లను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. 2019లో ఈ సంఖ్య 24,768 ఉండగా.. 2018లో 17,560 సైట్లను హ్యాకింగ్‌ బారిన పడ్డాయి. ఈ హ్యాకర్లు వివిధ దేశాల నుంచి ఈ దాడులు జరిపినట్లు తేలింది. హ్యాకర్ల ఐపీ అడ్రస్‌లను పరిశీలిస్తే.. అల్జీరియా, బ్రెజిల్‌, చైనా, ఫ్రాన్స్‌, ఇండోనేషియా, నెదర్లాండ్స్‌, ఉత్తరకొరియా, పాకిస్థాన్‌, రష్యా, సెర్బియా, దక్షిణకొరియా, తైవాన్‌, థాయ్‌లాండ్‌, టునీషియా, టర్కీ, అమెరికా, వియత్నాం తదితర దేశాల నుంచి ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది’’ అని తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తూ హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారని వెల్లడించారు.

ఇదీ చదవండి.. 

సైబర్‌ మోసాలతో ‘అణు’సంపద

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని