Himachal Pradesh: కుల్లూ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 27 ఇళ్లు దగ్ధం

హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లూ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మజాణ్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో 27 ఇళ్లు, రెండు దేవాలయాలు

Published : 12 Dec 2021 22:54 IST

కుల్లూ: హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లూ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మజాణ్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో 27 ఇళ్లు, రెండు దేవాలయాలు అగ్నికి ఆహుతయ్యాయి. 26 పశువుల పాకలు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్  కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇళ్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో.. భయంతో జనం పరుగులు పెట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఇళ్లు పూర్తిగా కాలిపోయాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై హిమాచల్‌ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Read latest National - International News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని