Dhanbad: అక్రమ బొగ్గు గని కూలి ముగ్గురి మృతి.. శిథిలాల కింద చిక్కుకున్నవాళ్లెందరో?!
ఝార్ఖండ్‌లో ఓ అక్రమ బొగ్గుగనిలో త్రవ్వకాలు జరుగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గని కూలిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. అనేకమంది చిక్కుకున్నట్టు సమాచారం.
ధన్‌బాద్: ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్(Dhanbad)లో అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగని(coal mine)లో ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గనిలో అక్రమంగా తవ్వకాలు కొనసాగుతుండగా ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మృతిచెందగా.. అనేక మంది చిక్కుకొని ఉంటారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం 10.30గంటల సమయంలో భారత్ కోకింగ్‌కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్)లోని భౌరా కాలరీ ప్రాంతంలో చోటుచేసుకోగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సింద్రీ డీఎస్సీ అభిశేక్ కుమా మాట్లాడుతూ.. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే ఎంతమంది మృతిచెందారు?గాయపడిన వారెందరు అనే వివరాలను చెప్పగలమన్నారు.
గనిలోకి అక్రమంగా మైనింగ్ చేపడుతున్నప్పుడు స్థానిక గ్రామస్థులు అనేకమంది పనుల్లో ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదం అనంతరం స్థానికుల సహాయంతో ముగ్గురిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చామని, ఆ తర్వాత వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించినట్టు తెలిపారు. భౌరా పోలీసుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/09/2023)
-
Koppula Harishwar Reddy: పరిగి ఎమ్మెల్యే తండ్రి, మాజీ ఉపసభాపతి కన్నుమూత
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Rahul Gandhi: విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణం.. బీఎస్పీ ఎంపీని కలిసిన రాహుల్
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Guntur: వైకాపా దాడి చేస్తే.. తెదేపా దీక్షా శిబిరాన్ని తొలగించిన పోలీసులు