kashmir: పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

కశ్మీర్‌లోని పుల్వామాలో శనివారం రాత్రి భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకొంది. ఈ ఎన్‌కౌంటర్లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. శనివారం రాత్రి దర్బ్‌గామ్‌ వద్ద భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు మొదలయ్యాయి.

Published : 12 Jun 2022 10:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కశ్మీర్‌లోని పుల్వామాలో శనివారం రాత్రి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. శనివారం రాత్రి దర్బ్‌గామ్‌ వద్ద భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌ దాదాపు 12గంటలపాటు సాగింది. ఎన్‌కౌంటర్‌ ముగిసిన తర్వాత ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందినట్లు దళాలు గుర్తించాయి. వీరి జునైన్‌ షీర్గోజ్రీ, ఫైజల్‌ నాజర్‌ భట్‌, ఇర్ఫాన్‌ అహ్‌ మాలిక్‌లుగా గుర్తించారు. 

ఈ ఎన్‌కౌంటర్‌పై కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘ మృతి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు స్థానికులే అని పేర్కొన్నారు. వీరు లష్కరే తొయిబా గ్రూప్‌నకు చెందినవారిగా గుర్తించారు. వీరిలో జునైద్‌ అనే ఉగ్రవాది గతంలో కశ్మీరీ పోలీస్‌కు చెందిన రియాజ్‌ అహ్మద్‌ను హత్య చేశాడు’’ అని పేర్కొన్నారు. వీరి ముగ్గురు నుంచి రెండు ఏకే-47లు, ఒక పిస్తోల్‌, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. 

పాక్‌ సరిహద్దులను భారత్‌ పటిష్ఠంగా మూసివేయడంతో కొత్త చొరబాట్లకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీంతో ఉగ్రవాదులు స్థానికులనే ఎగదోసి దాడులకు పాల్పడేట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ శిక్షణను మార్గంగా ఎంచుకొన్నట్లు తెలుస్తోంది. కశ్మీరీలో వరుస దాడులకు ఉగ్రవాదులు కొత్త పంథాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక యువతను ఆకర్షించి 10 - 15 రోజులు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వారితో నేరాలు చేయిస్తున్నట్లు జమ్మూకశ్మీర్‌ పోలీసులు చెబుతున్నారు. గత కొద్ద రోజులుగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో ఎక్కువగా స్థానిక ఉగ్రవాదులే ఉండటం ఇందుకు చిహ్నంగా నిలిచింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని