
Jammu kashmir: జమ్మూ- కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని సొపోర్‌లో మంగళవారం భద్రతాదళాలు, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని కశ్మీర్ పోలీసులు ధ్రువీకరించారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ట్విటర్ వేదికన వెల్లడించారు. సొపోర్‌లోని పీఠ్‌శీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతాదళాలు సోమవారం అర్ధరాత్రి కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ముష్కరులు వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. తొలుత ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కొద్దిసేపటికి మరొకరిని గుర్తించారు. వారు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారో గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురితో కలిపి 24 గంటల వ్యవధిలో 5 మందిని ఎన్‌కౌంటర్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ఏడాదిలో ఇప్పటివరకు కశ్మీర్ డివిజన్‌లో 100కు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఐజీపీ విజయ్‌కుమార్ ప్రకటించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.