Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో కాల్పులు .. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో టెర్రరిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Published : 26 Jun 2024 20:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ముష్కరులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. డోడా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉగ్రవాదులే ఇటీవల భారత సైన్యంపై కాల్పులు జరిపి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఇటీవల వరుస దాడులకు పాల్పడుతున్నారు. దీంతో డోడా, రాజౌరీ, పూంచ్‌ ప్రాంతాల్లో వీరిని ఏరివేసే ఆపరేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఆపరేషన్‌ మొదలుపెట్టిన భద్రతా దళాలకు.. అక్కడ ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం వచ్చింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపాయి. ఇందులో ముగ్గురు కుట్రదారులు హతమయ్యారు.

జీరో FIR, ఆన్‌లైన్‌ ఫిర్యాదులు.. జులై 1 నుంచే కొత్త చట్టాలు!

భద్రతా దళాలపై జూన్‌ 11న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సైనికులతో పాటు ఓ పోలీసు అధికారి తీవ్ర గాయాలపాలయ్యారు. మరో ఘటనలో పోలీస్‌ క్యాంపుపైనా దాడులు చేశారు. మరోవైపు భారత వాయుసేన కీలక స్థావరం ఉన్న పఠాన్‌ కోట్‌ జిల్లాలోనూ భారీ ఆయుధాలతో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో అక్కడా హైఅలర్ట్‌ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని