బీరుట్‌ బ్లాస్ట్‌: 2700టన్నుల రసాయనాలే కారణం!

లెబనాన్‌ రాజధాని బీరుట్‌ భారీ పేలుళ్లకు వణికిపోయిన విషయం తెలిసిందే. తొలుత ఏదైనా దాడి జరిగిందా? అనే కోణంలోనూ అనుమానించారు. కానీ, ఈ పేలుళ్లకు అమ్మోనియం నైట్రేట్‌ కారణమని తాజాగా లెబనాన్‌ అధికారులు ప్రకటించారు.

Updated : 05 Aug 2020 16:12 IST

లెబనాన్‌ ప్రధానమంత్రి వెల్లడి

బీరుట్: లెబనాన్‌ రాజధాని బీరుట్‌ భారీ పేలుళ్లకు వణికిపోయిన విషయం తెలిసిందే. తొలుత ఏదైనా దాడి జరిగిందా? అనే కోణంలోనూ అనుమానించారు. కానీ, ఈ పేలుళ్లకు అమ్మోనియం నైట్రేట్‌ కారణమని తాజాగా లెబనాన్‌ అధికారులు ప్రకటించారు. ఓ గోదాములో నిల్వఉంచిన భారీ రసాయనాల కారణంగానే ఇంతటి పేలుళ్లు సంభవించాయని వెల్లడించారు. 

నగరంలోని ఓడరేవు గోదాములో నిల్వఉంచిన 2700టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ ఈ పేలుళ్లకు కారణమని అధికారులు తేల్చారు. గత ఆరు సంవత్సరాలుగా భారీ రసాయనాలను గోదాములోనే ఉంచినట్లు గుర్తించారు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఈ స్థాయిలో రసాయనాలను నిల్వ ఉంచడం బాధ్యతారాహిత్యమని లెబనాన్‌ ప్రధాని హసాన్‌ దియాబ్‌ అన్నారు. దీనిపై ఎట్టిపరిస్థితుల్లోనూ మౌనం వహించమని, దీనికి కారణమైనవారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే, బీరుట్‌లో మంగళవారం జరిగిన పేలుళ్లలో దాదాపు 100మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే దాదాపు 4వేల మంది గాయపడినట్లు అంచనా వేస్తున్నారు. భారీపేలుళ్ల ధాటికి కూలిపోయిన భవనాల శిథిలాల్లో చిక్కుకుపోయిన వారికోసం గాలింపుచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వందల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని