CoronaVirus: ‘ఆర్మీవార్‌ కాలేజ్‌’లో కరోనా కలకలం..30మంది సైనికాధికారులకు పాజిటివ్‌!

ఇటీవల హయర్‌ కమాండ్‌ కోర్సు పూర్తి చేసుకొని వచ్చిన వారిలో 30మంది సైనిక అధికారులకు వైరస్‌ సోకింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది కళాశాలను తాత్కాలికంగా మూసివేశారు....

Published : 24 Sep 2021 18:04 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని మావ్‌లో ‘ఆర్మీవార్‌ కాలేజ్‌’లో కరోనా కలకలం రేపింది. ఇటీవల హయ్యర్‌ కమాండ్‌ కోర్సు పూర్తి చేసుకొని వచ్చిన వారిలో 30మంది సైనిక అధికారులకు వైరస్‌ సోకింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది కళాశాలను తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కళాశాల మూసివేసి ఉంచుతున్నట్టు ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఈ కాలేజ్‌లో వచ్చిన 30 కేసులతో పాటు మొత్తం ఇండోర్‌ జిల్లాలో తాజాగా 32 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు బులిటెన్‌లో వెల్లడించారు. పాజిటివ్‌ వచ్చిన సైనిక అధికారుల్లో కొవిడ్‌ లక్షణాల్లేవని, అంతా టీకాలు తీసుకున్నవారేనని ఇండోర్‌ చీఫ్‌ మెడికల్‌ అధికారి డాక్టర్‌ బీఎస్‌ సతియా వెల్లడించారు. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు.

కొవిడ్‌ నిబంధనల ప్రకారం.. ఇటీవల హయ్యర్‌ కమాండ్‌ శిక్షణ పూర్తిచేసుకొని తిరిగివచ్చిన 115 మంది అధికారులను క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు. ఇప్పటివరకు మొత్తంగా 60శాంపిల్స్‌ను ఇండోర్‌లోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. గత రెండు రోజుల వ్యవధిలో 30మంది మిలటరీ అధికారులకు పాజిటివ్‌గా తేలిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని